Amit Shah: కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో అధికారం తథ్యం: అమిత్‌ షా

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశరాజకీయలపైనా సుదీర్ఘంగా చర్చించారు. 

Updated : 12 Mar 2023 18:06 IST

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర భాజపా నేతలతో భేటీ అయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో సమావేశమై రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశ రాజకీయలపైనా సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాజకీయాలపై బండి సంజయ్‌.. అమిత్‌ షాకు ఒక నోట్‌ అందించినట్టు సమాచారం. సంజయ్‌ అందించిన నోట్‌పై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, నేతలు మరింత కలిసికట్టుగా పనిచేస్తే అధికారం తథ్యమని చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర నేతల పనితీరుకు కితాబు ఇచ్చిన అమిత్‌ షా.. చేరికలపై దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు