తమిళనాడు ఎన్నికల్లో సత్తా చాటుతాం: షా

తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 6న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఇక్కడ పర్యటించారు.

Published : 07 Mar 2021 15:45 IST

చెన్నై: తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 6న ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం ఇక్కడ పర్యటించారు. ఆ స్థానానికి భాజపా తరపున కేంద్ర మాజీ మంత్రి రాధాకృష్ణన్‌ను పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షా ఆయనతో కలిసి సుచీంద్రం జిల్లాలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనే కాదు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా సత్తా చాటుతుందన్నారు. ప్రచారంలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఫలితం కచ్చితంగా అర్థమవుతోందని హర్షం సంతోషం వ్యక్తం చేశారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు భాజపా, అన్నాడీఎంకే మధ్య పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ విషయంలో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. భాజపాకు 20 అసెంబ్లీతో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని కేటాయిస్తూ అన్నాడీఎంకే నిర్ణయించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఓకే దశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని