CM Kcr-Amith jogi: సీఎం కేసీఆర్‌తో అమిత్‌ జోగి భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఛత్తీస్‌గఢ్‌లోని జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ జోగి భేటీ అయ్యారు. జాతీయ వ్యవహారాలపై ఇరువురు నేతలూ చర్చించారు. 

Published : 01 Feb 2023 23:02 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఛత్తీస్‌గఢ్‌లోని జనతా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ జోగి భేటీ అయ్యారు. తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి వచ్చిన అమిత్‌ జోగి ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధి, దేశంలో రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాలపై ఇరువురు నేతలూ చర్చించారు.  జాతీయ పార్టీగా భారాస విధివిధానాలను అమిత్‌ జోగి కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఉందని అభిప్రాయపడిన అమిత్‌ జోగి.. భారాస ఆవిర్భావాన్ని ఆహ్వానించారు. తక్కువ కాలంలోనే తెలంగాణ పాలనను దేశానికి ఆదర్శంగా నిలిపారని.. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేశారని కేసీఆర్‌ను అభినందించారు. తన తండ్రి, ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి రాసిన ఆటోబయోగ్రఫీని సీఎం కేసీఆర్‌కు బహూకరించారు. జనతా కాంగ్రెస్‌ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు