Munugode: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ

మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ నెలకొంది. ఈటల రాజేందర్‌

Published : 18 Aug 2022 17:14 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి కోసం భాజపా నేతల మధ్య పోటీ నెలకొంది. ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌, మనోహర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అమిత్‌ షా పర్యటన తర్వాత ఇన్‌ఛార్జిని ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే చౌటుప్పల్‌ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్‌లను ఈటల రాజేందర్‌ భాజపాలోకి తీసుకొచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్‌ సెంటిమెంట్‌తో జితేందర్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా, స్థానిక నేతగా మనోహర్‌రెడ్డిని ఉప ఎన్నిక ఇన్‌ఛార్జిగా పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డికి సన్నిహితుడిగా, పార్టీకి దగ్గరగా ఉన్న నేతగా వివేక్‌ పేరూ పరిశీలనలో ఉంది.

అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

నల్గొండ జిల్లా మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 21న మధ్యాహ్నం 3.30గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రానున్న అమిత్‌ షా ప్రత్యేక హెలికాప్టర్‌లో 4.30గంటలకు మునుగోడు చేరుకుంటారు. సీఆర్పీఎఫ్‌ అధికారులతో సమీక్ష అనంతరం సాయంత్రం 5గంటలకు బహిరంగసభలో పాల్గొంటారు. 6గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని