Anam: అక్కడంతా ఏకఛత్రాధిపత్యమే.. వాళ్లకి భజనపరులే కావాలి: ఆనం రామనారాయణరెడ్డి
గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
హైదరాబాద్: గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదని నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) అన్నారు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణమని చెప్పారు. ఎంతో మంది పెద్ద నేతలతో పనిచేశానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ పార్టీ నుంచి వైకాపా (YSRCP) సస్పెండ్ చేసిన నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ’తో ఆనం మాట్లాడారు. పరోక్షంగా వైకాపా, సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన విమర్శలు చేశారు.
సీఎంవో నుంచి ఫోన్లు వచ్చాయి..
‘‘ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే ప్రశ్నిస్తూ వచ్చాను. ప్రశ్నించే గొంతుక అంటే ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని సద్విమర్శగా తీసుకుని మంచి చేసేందుకు ప్రయత్నం చేయాలి. కానీ అధికారంలోని పార్టీ ప్రశ్నించే గొంతుకను తొక్కేయడం, నలిపివేయడం చేస్తోంది. రాష్ట్రంలో, మా జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థలపై ప్రశ్నించాను.. విమర్శించాను. అభివృద్ధి నిలిచిపోయిందని.. అరాచకకాలు జరుగుతున్నాయని చెప్పాను. ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు జరగడంలేదని గత నాలుగు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. అందుకే నన్ను పక్కన పెట్టి నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టారు. నాకు సహకరించవద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సీఎంవో నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఆఖరికి నా భద్రతను కూడా తగ్గించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని..
ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఈ విధంగా చేశారు. మీరేమైనా అనుకోండి.. మేం అనుకున్నదే చేస్తాం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. అటువంటి సలహాదారుల సలహాలతో నడిచే ప్రభుత్వం మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతుంది. మేం అమ్ముడు పోయామంటూ కొందరు చేసిన ఆరోపణలను మీడియాలో చూశాం. మాపై విమర్శలు చేసిన ప్రభుత్వ సలహాదారు రూ.వేలకోట్లు ఎలా సంపాదించారో మేం చూశాం. ఆయనలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి నిందలు, ఆరోపణలు సహజం. మా గురించి తెలిసిన వారు వాటిని విశ్వసించరు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు మేం పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ల ఖర్మే.
రాజకీయ అహంకారపూరిత ధోరణితో..
క్రాస్ ఓటింగ్‌ను నిర్ధారించడం సీక్రెట్ బ్యాలెట్‌లో సాధ్యం కాదు. అంత పటిష్ఠమైన చట్టం ఉంది. మనల్ని విమర్శించే వారిని బయటకు పంపడమెలా అని ఆలోచించి ఈ విధంగా సస్పెండ్ చేశారు. మా ప్రభుత్వంలో అంతా ఏకఛత్రాధిపత్యమే. పూర్వం చక్రవర్తులు, రాజుల పాలన తరహా జరుగుతోంది. భజనపరులే కావాలనుకునే మనస్తత్వం వారిది. రాజకీయ అహంకారపూరిత ధోరణితో ఉన్న వ్యవస్థలో మమ్మల్ని ఉంచుకోవడం వారికి ఇష్టం లేదు. ఇతర ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య విలువలతో పాటు పార్టీలోని వ్యక్తులను గౌరవించేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా. నా కుటుంబసభ్యులు ఎవరు రాజకీయాల్లోకి వస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది’’ అని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: విరాట్‌ను అడ్డుకోవడం అంత సులువేం కాదు: ఆసీస్ ఆల్‌రౌండర్
-
Crime News
Kadapa: ప్రాణం తీసిన పూచీకత్తు.. చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు!
-
Education News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 హాల్‌టికెట్లు విడుదల
-
India News
Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
-
Movies News
keerthy suresh: పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను..: కీర్తి సురేశ్
-
Sports News
WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్