తొలిదశ పల్లె పోరుకు ముగిసిన ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు వాడీ-వేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9న జరిగే

Updated : 07 Feb 2021 20:19 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు వాడీ-వేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9న జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సర్పంచ్‌ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు ఓటు వేయాలని కోరుతూ వీధివీధికీ, ఇంటింటికీ తిరిగారు. పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో 32,502 వార్డులకు నోటిఫికేషన్‌జారీ అయింది. ఇందులో 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం 2,731 పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి సర్పంచ్‌ను ప్రకటిస్తారు. మరోవైపు మంగళవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసి, పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరిగే

జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాల జాబితా

శ్రీకాకుళం

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మండలాలు: ఎల్‌.ఎన్‌.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి

విశాఖపట్నం

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: అనకాపల్లి

మండలాలు: అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం

తూర్పుగోదావరి

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కాకినాడ, పెద్దాపురం

మండలాలు: గొల్లప్రోలు, కాకినాడ రూరల్‌, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి

గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండంగి, తుని, ఏలేశ్వరం

పశ్చిమగోదావరి

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నర్సాపురం

మండలాలు: ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి

కృష్ణా

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: విజయవాడ

మండలాలు: చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం,జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ

గుంటూరు

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: తెనాలి

మండలాలు: అమర్తలూరు, బాపట్ల, బట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వి.పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు

ప్రకాశం

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: ఒంగోలు

మండలాలు: అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులూరు, కారంచేడు, కొరిసపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్‌.జి.పాడు, ఒంగోలు, పర్చూరు, ఎస్‌.మాగులూరు, ఎస్‌.ఎన్‌.పాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కావలి

మండలాలు: అల్లూరు, బోగోలు, దగదర్తి, దుత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు

కర్నూలు

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: నంద్యాల, కర్నూలు

మండలాలు: ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు

అనంతపురం

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: కదిరి

మండలాలు: ఆమడగూర్‌, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్‌.పి కుంట, నల్లచెరువు, నల్లమడ, ఓబులదేవరచెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్‌

వైయస్సార్‌ కడప

మొదటి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: జమ్మలమడుగు, కడప, రాజంపేట

మండలాలు: చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పోరుమామిళ్ల, ఎస్‌.ఎ.కె. ఎన్‌, కలసపాడు, బి.మఠం

చిత్తూరు

తొలి విడత (09-02-2021)

రెవెన్యూ డివిజన్‌: చిత్తూరు

మండలాలు: బంగారుపాలెం, చిత్తూరు, జి.డి. నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఆర్‌.సి.పురం, ఎస్‌.ఆర్‌ పురం, తవనంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి

ఇదీ చదవండి

16మందిని కాపాడిన ఐటీబీపీ సిబ్బంది: వీడియో వైరల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని