Jadcherla: జడ్చర్ల కాంగ్రెస్‌లో రచ్చ.. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌పై అనిరుధ్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఇటీవల జరుగుతున్న

Updated : 18 Aug 2022 14:53 IST

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు బయటపడ్డాయి. పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణమాలపై ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అనిరుధ్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసుకుంటున్న తనను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌కు అనిరుధ్‌రెడ్డి వాట్సాప్‌ ద్వారా లేఖ పంపారు. 

9 హత్య కేసుల్లో నిందితుగా ఉన్న ఎర్ర శేఖర్‌తో వేదిక పంచుకోలేనని మాణికం ఠాగూర్‌కు అనిరుధ్‌ స్పష్టం చేశారు. సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముడినే శేఖర్‌ హత్య చేశారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పార్టీలో చేరిన సందర్భంలో ఒకలా.. ఇప్పుడు మరోలా శేఖర్‌ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 

‘‘ఎర్ర శేఖర్‌పై 9 హత్య కేసులు ఉన్నాయి. అలాంటి వారిని పార్టీలోకి తీసుకుంటే నష్టం జరుగుతుందని చెప్పాం. అయినా పార్టీలోకి తీసుకున్నారు. సరే పార్టీ నిర్ణయం కదా అని ఊరుకున్నాం. హంతకుడి పక్కన నిలుచుంటే ప్రజలు ఏం చూసి మాకు ఓటేస్తారనే ఆలోచనలో పడ్డాం. సర్పంచ్‌ పదవి కోసం సొంత తమ్ముడినే చంపిన వ్యక్తి..  ఎమ్మెల్యే టికెట్‌ కోసం చంపడని గ్యారెంటీ ఏంటని నా అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మక్తల్‌, దేవరకద్రలోనూ ఇతర పార్టీల నేతలను తీసుకుంటున్నారు. దీంతో మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్‌ నేతల పరిస్థితి ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు’’ అని అనిరుధ్‌రెడ్డి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని