Agnipath: ‘అగ్నిపథ్‌’పై ఆందోళన.. నిరుద్యోగ సంక్షోభానికి సూచిక: కేటీఆర్‌

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు

Published : 17 Jun 2022 12:10 IST

హైదరాబాద్‌: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నిరసన జ్వాలలు దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయని దుయ్యబట్టారు.

‘‘అగ్నివీర్‌ పథకంపై జరుగుతోన్న ఈ హింసాత్మక ఆందోళనలు.. దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలిపే కచ్చితమైన సూచికలు. అప్పుడు దేశ అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడేమో దేశ జవాన్లతో ఆడుకుంటున్నారు. మొన్న ‘ఒకే ర్యాంక్‌ - ఒకే పింఛను’ విధానం.. నేడు ‘ర్యాంకు లేదు - పింఛను లేదు’ అనే ప్రతిపాదన’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు.

అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు హైదరాబాద్‌కు విస్తరించాయి. నేటి ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు