Amalapuram: అమలాపురం పోలీసుల అదుపులో అన్యం సాయి!

అమలాపురంలో నిన్న చోటుచేసుకున్న అల్లర్ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడుగా....

Published : 25 May 2022 19:30 IST

అమలాపురం: అమలాపురంలో నిన్న చోటుచేసుకున్న అల్లర్ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వైకాపా కార్యకర్త అన్యం సాయితో పాటు 46 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. మంత్రి విశ్వరూప్‌ అనుచరుడైన అన్యం సాయి.. ఈ నెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనల్లో పాల్గొన్నాడు. అమలాపురం కలెక్టరేట్‌ వద్ద పెట్రోల్‌ పోసుకొని హల్‌చల్‌ చేశాడు. గతంలోనే సాయిపై రౌడీషీట్‌ తెరిచిన పోలీసులు తాజాగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు