AP Assembly: 24 నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ వరకూ.. మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి.

Updated : 17 Jun 2024 20:07 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా.. గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత.. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని