Assembly Sessions: జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. త్వరలో తేదీలు ఖరారు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జూలై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు.

Updated : 24 Jun 2024 19:02 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జూలై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. త్వరలో ఈ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలఖారుతో ముగియనుంది. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెదేపా-జనసేన-భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించనుంది. ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ చట్టం రద్దుతో పాటు పలు బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని