నాని భేషరతుగా క్షమాపణలు చెప్పాలి: భాజపా

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఖండించింది. భేషరతుగా  క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే కొడాలి...

Published : 24 Sep 2020 01:06 IST

అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఖండించింది. భేషరతుగా  క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే కొడాలి నానిని తన మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలంటూ రేపు అన్ని జిల్లాల కలెక్టరు కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. భాజపాపై మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీవీఎన్‌ మాధవ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోన్న మంత్రి నానిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సైతం నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని తమ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోందన్నారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అండ చూసుకునే మంత్రి నాని తన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. అధికార పార్టీలో పిచ్చోళ్లు ఎక్కవయ్యారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహకారంతో ఇలాంటి వాళ్లను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని కోరతామని వారు ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని