Andhra News: మా వ్యవస్థను ప్రశాంత్‌ కిషోర్‌ కాపీ కొట్టారు: సోము వీర్రాజు

ఏపీలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే భాజపాతోనే సాధ్యమని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated : 15 Mar 2022 13:18 IST

విశాఖ: ఏపీలో ప్రత్యామ్నాయం ఏర్పడాలంటే భాజపాతోనే సాధ్యమని ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాకే దశాదిశ ఉన్న ప్రభుత్వం వస్తుందని చెప్పారు. విశాఖలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. 

‘‘భాజపా గెలుపునకు పేజ్‌ ప్రముఖ్‌ వ్యవస్థ కీలకమైంది. కోడికత్తి పీకే(ప్రశాంత్‌ కిషోర్‌) మా పేజ్‌ ప్రముఖ్‌ వ్యవస్థను కాపీ కొట్టారు. బియ్యం, ఉపాధి హామీ అన్నీ కేంద్రమే ఇస్తోంది. జగన్‌ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర పెండింగ్‌ ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగులకు నిరీక్షణ తప్ప ఫలితం లేకుండా పోయింది. సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ నెల 19న ‘చలో కడప’ చేపట్టబోతున్నాం’’ అని సోము వీర్రాజు అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని