AP Cabinet: ఈ నెల 24న ఏపీ కేబినెట్‌ భేటీ

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈనెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు.

Published : 19 Jun 2024 12:59 IST

అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం ఈనెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వశాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని