AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఏపీ క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు.

Published : 24 Jun 2024 11:13 IST

అమరావతి: ఏపీ క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై ఐదు సంతకాలు చేశారు. ఈ క్యాబినెట్‌ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని