Andhra News: చంద్రబాబు, నారాయణ సహా పలువురిపై ఏపీ సీఐడీ కేసులు

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేసిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ పోలీసులు

Updated : 10 May 2022 14:00 IST

అమరావతి: రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చేసిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులో అవకతవకలు జరిగాయంటూ గత నెల 27న ఆర్కే ఫిర్యాదు చేశారు. ఈనెల 6న విచారణ చేపట్టిన పోలీసులు.. అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

దీనిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్‌, ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజనీకుమార్‌పై సీఐడీ కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ 13 (1ఏ) కింద కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని