Chandrababu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

Updated : 01 Jul 2024 21:40 IST

అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని