Chandrababu: ఉత్తరాంధ్ర పర్యటన.. అనకాపల్లి చేరుకున్న సీఎం చంద్రబాబు

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి చేరుకున్నారు.

Updated : 11 Jul 2024 12:36 IST

అనకాపల్లి: ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు అనకాపల్లి చేరుకున్నారు. సీఎంకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం దార్లపూడి వెళ్లారు. అక్కడ పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించనున్నారు.

మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై.. ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని