Chandrababu: కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు.

Updated : 25 Jun 2024 13:55 IST

కుప్పం: ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 

బుధవారం ఉదయం ఆర్ అండ్‌బీ అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం పీఈఎస్‌ ఆడిటోరియంలో తెదేపా శ్రేణులతో నిర్వహించే సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు. కుప్పం చేరుకున్న సీఎంకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని