Mudragada: ముద్రగడ పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌

వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 20 Jun 2024 11:57 IST

అమరావతి: వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్‌ విసిరారు. పవన్‌ గెలిచిన నేపథ్యంలో తన పేరును మార్చుకుంటానని.. గెజిట్‌ దరఖాస్తు పెట్టుకుంటానని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నందున ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని