అసైన్డ్ భూముల అంశంలో చంద్రబాబుకు ఊరట

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో

Published : 17 Apr 2021 01:49 IST

అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ మరో మూడు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.  అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన ధర్మాసనం దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మరోసారి పిటిషన్‌పై విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగిస్తూ తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని