Andhra News: విశాఖ రాజధాని అనడం ‘ధిక్కారమే’.. ముఖ్యమంత్రి జగన్‌పై సుప్రీంకు లేఖ

రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే విశాఖకు వెళ్తున్నట్లు పరోక్షంగా సీఎం జగన్‌ చెప్పడంపై ఏపీ హైకోర్టు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని పేర్కొంటూ సీఎం జగన్‌పై న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి లేఖ రాశారు. 

Published : 04 Feb 2023 08:11 IST

సుమోటోగా స్వీకరించాలని సీజేఐను కోరిన హైకోర్టు న్యాయవాది

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. రాబోయే రోజుల్లో మన రాజదాని కాబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానంటూ జనవరి 31న దిల్లీలో పెట్టుబడిదారుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొనడం న్యాయస్థాన ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్‌ 2(సి)ను ఉల్లంఘించినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మాటల ద్వారా సుప్రీం కోర్టు అధికారాన్ని ఆయన ధిక్కరించారని స్పష్టమైందన్నారు. ఈ దృష్ట్యా ఆయనపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాసినట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు