కేసుల రీఓపెన్‌ కోరితే తప్పకుండా చేస్తాం: ఏపీ హోంమంత్రి అనిత

రాష్ట్ర ప్రజలు, సీఎం చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు.

Updated : 19 Jun 2024 15:40 IST

అమరావతి: రాష్ట్ర ప్రజలు, సీఎం చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. తనను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. 

‘‘నాపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. దిశ పోలీస్‌స్టేషన్ల పేరు మారుస్తాం. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలి. ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలి. సోషల్‌ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ రవాణా చాలా మేరకు తగ్గిస్తాం. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాం. బాధితులు కేసులు రీఓపెన్‌ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం’’ అని అనిత తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని