Anitha: పోలీసులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: హోం మంత్రి అనిత

రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

Published : 14 Jun 2024 20:13 IST

అమరావతి: రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని తెలిపారు. పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. పోలీసులు ప్రజల కోసం.. చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైకాపా ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు