‘ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు’

రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు నిరాధారమని ఏపీ హోమంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు

Published : 18 Aug 2020 02:00 IST

ఏపీ హోం మంత్రి సుచరిత

అమరావతి: రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరాధారమని ఏపీ హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సమయంలో ప్రభుత్వ ఆదరణ పెరగకుండా ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు.

‘‘ఈ ప్రభుత్వానికి ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అవసరం లేదు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్‌ చేస్తారు. మీరు ఏమైనా సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారా? ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తే మీ మనీ లాండరింగ్‌  వ్యవహారం బయటకు వస్తుందని భయపడుతున్నారా? దేశంలోనే జగన్‌ మూడో అత్యుత్తమ సీఎం అని పేరు తెచ్చుకోవడం చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని సుచరిత అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని