Ap News: గోరంట్ల మాధవ్‌ను మేం రక్షించడం లేదు: హోం మంత్రి వనిత

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర ఉందని ఆమె

Updated : 09 Aug 2022 19:19 IST

అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంపై ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ వ్యవహారంలో రాజకీయ కుట్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మాధవ్‌ వీడియో ప్రస్తుతం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరిశీలనలో ఉందని.. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ఆ వీడియో నిజమని తేలితే శిక్ష, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అది మార్ఫింగ్‌ వీడియో అని మాధవ్‌ కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎంపీ మాధవ్‌ను ప్రభుత్వం రక్షించడం లేదని ఇప్పటికే ప్రకటించినట్లు వనిత స్పష్టం చేశారు. దిశ యాప్ తీసుకొచ్చి 900 మంది మహిళలను రక్షించామని హోంమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు