AP News: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా అభ్యర్థులు వీరే!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు

Updated : 12 Nov 2021 18:06 IST

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించినట్టు వివరించారు. ‘‘బిచ్చమెత్తుకుంటున్నామని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అనడం సరికాదు. కేంద్ర నిధులు రాష్ట్రాల హక్కు అని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ మాటలు ఆయన మంత్రులు వినలేదేమో. కేంద్ర నిధుల సాధనలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో పద్ధతి. ఏపీ ఎలా పోతుందో తెలంగాణ మంత్రులకు ఎందుకు?’’ అని సజ్జల అన్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

విజయనగరం జిల్లా నుంచి రఘురాజు, విశాఖపట్నం నుంచి ఒరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్‌, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్ కుమార్‌, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు, అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్‌ను సీఎం జగన్‌ ఎంపిక చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని