Andhra News: వరదలొచ్చి పనులాగితే మేమేం చేస్తాం!: మంత్రి అంబటి రాంబాబు

పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి సంబంధించి పీపీఏ రాసిన లేఖ వాస్తవమేనని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై రాష్ట్ర

Published : 10 Aug 2022 20:35 IST

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి సంబంధించి పీపీఏ రాసిన లేఖ వాస్తవమేనని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. సీజన్‌ కంటే ముందే ఆకస్మికంగా గోదావరి నదిలో వరదలు వచ్చి పనులు నిలిచిపోయాయని, వరదల వల్లే జులై 31లోగా పనులు పూర్తి చేయలేక పోయామన్నారు. కేంద్ర జలసంఘం, పీపీఏ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖలు అత్యంత సహజమన్న అంబటి.. వైకాపా ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే ఈ తరహా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  

‘‘గతంలో ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థను పక్కకు పెట్టి నవయుగ సంస్థకు ప్రాజెక్టు నిర్మాణం ఏ ప్రాతిపదికన అప్పగించారు? కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా డయాఫ్రంవాల్‌ కట్టినందువల్లే ప్రాజెక్టు నిర్మాణం గందరగోళంలో పడింది. 2019లో వచ్చిన వరదకు డయాఫ్రం వాల్‌ వద్ద ఆగాధాలు ఏర్పడ్డాయి. దాదాపు 60 నుంచి 80 మీటర్ల లోతైన గోతులను సరిచేసేందుకు సమయం పడుతుంది. జెట్‌గ్రౌటింగ్‌ ద్వారా జియో బ్యాగ్‌లు వేసి గట్టి పరిచేందుకు ప్రయత్నించేలోపు గోదావరిలో వరద వచ్చింది. ఆకస్మికంగా వరదలు వచ్చి పనులు నిలిచిపోతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవటం సహా ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలకు అప్పటి అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం డయాఫ్రం వాల్‌ ఏ మేరకు దెబ్బతింది, ఎంత దెబ్బతిందనే దానిపై అధ్యయనం జరుగుతోంది’’ అని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని