Andhra news: విశాఖ రాజధానిగా వ్యతిరేకించే వారిని ఉత్తరాంధ్రలో తిరగనివ్వొద్దు: మంత్రి అప్పలరాజు

అందరం ఒక్కమాటపై నిలబడి విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వారిని ఈ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వకూడదని ఏపీ మంత్రి అప్పలరాజు విశాఖలో అన్నారు.

Published : 08 Jan 2023 01:41 IST

విశాఖపట్నం: విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనే ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఏ ఒక్క నాయకుడిని ఉత్తరాంధ్రలో తిరగనివ్వవద్దని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో రూ.2.75 కోట్లతో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సుస్థిరమైన పాలన కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్‌ను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తులేదు. విశాఖ గుర్తుకు రాలేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టీ ఉత్తరాంధ్ర కావాలి.. రాజకీయాలు చేయాలి. అందరం ఒక్కమాటపై నిలబడి విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వారిని ఈ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వకూడదు. 2024లో రాబోయే ఎన్నికలకు చంద్రబాబు చేసే మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దు’’ అని మంత్రి అప్పలరాజు  ప్రజలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని