Andhra News: 3 రాజధానులు మా విధానం.. సమయం చూసి బిల్లు పెడతాం: బొత్స

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల వివాదం ఇంకా చల్లారలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రులు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ

Updated : 23 Mar 2022 05:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల వివాదం ఇంకా చల్లారలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా మంత్రులు దీనిపై స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానుల అంశంపై స్పందించారు. ‘‘3 రాజధానులు అనేది మా పార్టీ, ప్రభుత్వ విధానం. ఇదే మా విధానమని మొదట్నుంచీ చెబుతున్నాం. రాష్ట్రసమగ్రాభివృధ్ధే మా లక్ష్యం. ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. సమయం చూసుకుని అసెంబ్లీలో బిల్లు పెడతాం. స్మార్ట్‌ సిటీ మిషన్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన వారికి ఇంకా పెద్ద పదవి ఇస్తామేమో’’ అని బొత్స వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని