Andhra news: అందరికీ ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్‌ : మంత్రి బుగ్గన

రాష్ట్ర ప్రభుత్వం సలహాల మేరకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేసినందుకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ ఉపయోగపడే విధంగా కేంద్ర బడ్జెట్‌ ఉందన్నారు.

Updated : 01 Feb 2023 17:07 IST

అమరావతి: కేంద్ర బడ్జెట్‌ను (Budget 2023) మంచి బడ్జెట్‌ అని భావిస్తున్నామని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అందరికీ ఉపయోగపడే విధంగా  ఉందన్నారు. ‘‘రాష్ట్రానికి ఎరువుల్లో రూ.50వేల కోట్లు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాల మేరకు కేటాయింపులు చేసినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్లాంట్ల కోసం పాలసీ ప్రకటించారు. ఏపీ విజ్ఞప్తితో పీఎం ఆవాస్‌ యోజన నిధులు పెంచారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు అభినందనీయం. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, హెలిప్యాడ్‌ల ఏర్పాటుతో ప్రయోజనం. వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.7లక్షలకు పెంచడం అభినందనీయం. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియరాలేదు’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎం పరిపాలనా కార్యాలయం: బుగ్గన

పాలన వికేంద్రీకరణ చేయడమే  రాష్ట్ర ప్రభుత్వ విధానమని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఒకే చోట అభివృద్ధి ఉండకూడదనేది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. ‘‘విశాఖ రాజధాని అని సీఎం జగన్‌ ప్రకటన చేశారు. సీఎం ఎక్కడ ఉంటే అదే సీఎం పరిపాలన కార్యాలయం. రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు’’ అని బుగ్గన అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని