మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్య శిక్షణ: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

Updated : 06 Jul 2024 14:00 IST

విజయనగరం: గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలోని టీటీడీసీ శిక్షణా కేంద్రం, జిల్లా సమాఖ్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. యువతీయువకులు ఉద్యోగాలు పొందిన తీరు, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థల గురించి ఆరా తీశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. నైపుణ్యం ఉన్న యువతకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నాం’’ అని మంత్రి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని