Nimmala Ramanaidu: వాలంటీర్‌ వ్యవస్థ రద్దు కాలేదు: ఏపీ మంత్రి నిమ్మల

ఏపీలో ఎన్నికలు ముగిసి.. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వాలంటీర్‌ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది

Updated : 13 Jun 2024 20:17 IST

అమరావతి: ఏపీలో ఎన్నికలు ముగిసి.. ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వాలంటీర్‌ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థ ఇంకా రద్దు కాలేదని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో తాత్కాలికంగా వారిని విధుల నుంచి దూరం పెట్టినట్లు చెప్పారు. వాలంటీర్లు.. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వ్యక్తులని పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహిస్తుందని, వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకుంటుందని చెప్పారు. ప్రజలకు ఇంటి వద్దే పింఛను అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుతాయని తెలిపారు. శాఖలవారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని