Pawan Kalyan: నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు తేవొద్దు: పవన్‌

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

Published : 13 Jun 2024 19:16 IST

అమరావతి: రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆయన్ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తనే స్వయంగా జిల్లాలవారీగా వచ్చి పార్టీ శ్రేణులు, అభిమానులను కలుస్తానని ప్రకటించారు.

‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగంలో ఉన్నవారు, యువత, రైతులు ఇలా అందరూ నాకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని పవన్‌ తెలిపారు.  

20న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తా...

తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 20న పర్యటిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను కలుస్తానన్నారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని