Perni Nani: గత్యంతరం లేకే ఉద్యోగులతో బేరాలు: ఏపీ మంత్రి పేర్ని నాని

వైకాపా అధికారంలోకి రావడంలో ఉద్యోగులు కీలకమని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను చూసి ఐక్యంగా ఉండటం నేర్చుకోవాలని చెప్పారు.

Updated : 06 Apr 2022 17:46 IST

అమరావతి: వైకాపా అధికారంలోకి రావడంలో ఉద్యోగులు కీలకమని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను చూసి ఐక్యంగా ఉండటం నేర్చుకోవాలని చెప్పారు. ఉద్యోగులపై ప్రేమే లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం 27 శాతం ఐఆర్‌ ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. పీఆర్సీ బాలేదని కొందరు అంటున్నారని.. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పీఆర్సీ విషయంలో గత్యంతరం లేకే ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని