Updated : 29/10/2021 18:55 IST

Politics: అందుకే తెలంగాణలో కొత్తపార్టీలు పుట్టుకొస్తున్నాయి: పేర్ని నాని

అమరావతి: ఆంధ్రాలోనూ పార్టీ పెట్టాలని కోరుతున్నారని తెరాస ప్లీనరీ సందర్భంగా ఆపార్టీ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో  చర్చ కొనసాగుతోంది. దీనిపై నిన్న మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇవ్వగా.. పేర్ని నాని, కేసీఆర్‌ వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా రేవంత్‌ రెడ్డి స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో మరోసారి స్పందించారు.

తెలంగాణలో రాజకీయ శూన్యత వల్లే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఓ ఐపీఎస్‌ అధికారి రాజీనామా చేసి మరీ పార్టీ పెట్టారని, మరి కొన్ని పార్టీలు కూడా వచ్చాయని మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో 151 స్థానాలు వచ్చిన తర్వాత శూన్యత ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల గుండెల్లో ఎక్కడా శూన్యత లేదన్నారు. మరోవైపు నదీ జలాల వినియోగం విషయంలో కేసీఆర్‌ మాట తప్పారని మంత్రి వ్యాఖ్యానించారు. దిండి - పాలమూరు ప్రాజెక్టు నుంచి  తాగునీరు పేరుతో సాగుకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఏపీకి కేటాయించిన నీటిలో అదనంగా చెంచాడు నీళ్లు కూడా వినియోగించుకోబోమని ఎప్పుడో చెప్పామని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత విషయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఎంత దూరమో... విజయవాడ నుంచి హైదరాబాద్‌ కూడా అంతే దూరమని గమనించాలన్నారు. నిత్యం రాజకీయాల్లో ఉండాలనుకునే రేవంత్‌రెడ్డి వంటి వాళ్లు సంచలనాల కోసం ఏ అంశంపై అయినా ట్వీట్లు చేస్తారని పేర్ని నాని అన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని