Satya Kumar: మీ ఫ్రెండ్‌ గురించి మీకు తెలిసినట్లు లేదు.. కేటీఆర్‌పై మంత్రి సత్యకుమార్‌ విసుర్లు

తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో మాజీ సీఎం జగన్, ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడి ప్రజాకంటకులుగా మారారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఆరోపించారు.

Updated : 11 Jul 2024 09:23 IST

ధర్మవరం, న్యూస్‌టుడే: తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్రంలో మాజీ సీఎం జగన్, ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడి ప్రజాకంటకులుగా మారారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఆరోపించారు. బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం పేరుతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సందులు, గొందుల్లో తిరుగుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కాజేశారని కేటీఆర్‌కు తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. ఇవేవీ తెలుసుకోకుండా ధర్మవరంలో ప్రజల్లో తిరిగిన  మా ఫ్రెండ్‌ కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయారోనని కేటీఆర్‌ మాట్లాడటం సరికాదని అన్నారు. తెలంగాణలో భారాసను, ఏపీలో వైకాపాను ప్రజలు మూకుమ్మడిగా ఓడిస్తే జగన్, కేటీఆర్, కేతిరెడ్డి ఒక చోటకు చేరి ఒకరికొకరు ఓదార్చుకుంటూ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని