Andhra News: రేపల్లె అత్యాచార ఘటనకు కొత్త భాష్యం చెప్పిన హోం మంత్రి వనిత

రేపల్లె అత్యాచార ఘటనకు ఏపీ హోం మంత్రి తానేటి వనిత కొత్త భాష్యం చెప్పారు. మద్యం మత్తులోనే రేపల్లె నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు.

Updated : 04 May 2022 05:44 IST

అమరావతి: రేపల్లె అత్యాచార ఘటనకు ఏపీ హోం మంత్రి తానేటి వనిత కొత్త భాష్యం చెప్పారు. మద్యం మత్తులోనే రేపల్లె నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. బాధితురాలి భర్త వద్ద దొంగతనానికి యత్నించిన నిందితులు... మద్యం మత్తులో అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల కొరత ఉన్నమాట వాస్తవమేనని.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వరుస దురాగతాలకు పోలీసుల కొరత కారణం కాదని పేర్కొన్నారు. తరచుగా జరుగుతున్న అత్యాచార ఘటనల వల్లే గడప గడపకూ వైకాపా కార్యక్రమాన్ని వాయిదా వేశారన్న ప్రచారాన్ని హోం మంత్రి ఖండించారు. ‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకటి నుంచి ఐదు సంక్షేమ పథకాలు అందించాం. ఆ ఇంటికి వెళ్లినప్పుడు వారికి ఏ ఏ పథకాలు అందించామో వివరించేందుకు సచివాలయాల నుంచి డేటా రావాల్సి ఉంది. ఆ వివరాలు రావడం ఆలస్యం కావడం వల్లే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం తప్ప.. ఎవరో ఇబ్బంది పెడతారని వాయిదా వేయలేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని