‘చంద్రబాబు డైరెక్షన్‌లో రఘురామకృష్ణరాజు’ 

వినాయక చవితి పండగపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఖండించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే ..

Published : 23 Aug 2020 02:43 IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆరోపణ

తిరుమల: వినాయక చవితి పండగపై ప్రతిపక్షాలు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేస్తున్న ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఖండించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమే వినాయ చవితి ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 

వినాయక చవితి ఉత్సవాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పండితులు, మత పెద్దలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు అన్ని పండగలను ఇళ్లలోనే చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయెద్దని సూచించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గత ఐదు నెలలుగా తన సొంత నియోజకవర్గానికి కూడా రాలేదని విమర్శించారు. దిల్లీలో కూర్చుని మాట్లాడటం కాదు.. అంత ప్రేమ ఉంటే సొంత నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ మండిపడ్డారు. రఘురామ కృష్ణరాజు.. చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం పూజలు చేసుకుని ప్రజలు సురక్షితంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని