సింహాచలం భూముల రక్షణకు ప్రహరీగోడ

దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌,

Published : 17 Jun 2021 01:34 IST

విశాఖపట్నం: దేవాదాయ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై ఈరోజు విశాఖపట్నంలో సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...సింహాచలం దేవస్థానం భూములను కాపాడి తీరుతామని స్పష్టం చేశారు. సింహాచలం భూముల రక్షణకు అవసరమైతే ప్రహరీగోడ నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు ఎప్పటికైనా ప్రభుత్వానికే వస్తాయన్నారు. దేవాలయ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఎకరం కూడా ఆక్రమణకు గురి కాకూడదని  అధికారులకు స్పష్టం చేశారు.

వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి: కన్నబాబు

‘‘విశాఖలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది. తెతేపా నేతలు అనేక ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. భూములు లీజుకు ఇవ్వడంపై విధానాలు తీసుకురావాలి. మాన్సాస్‌ భూములపై నివేదిక ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లను కోరాం. దేవాదాయశాఖ కింద నడిచే ట్రస్టులకు నిబంధనలు ఉంటాయి. పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని తెదేపా మేనిఫెస్టోలో పెట్టింది. ఆ సమస్యను తెదేపా ఎందుకు పరిష్కరించలేదు? అశోక్‌గజపతి రాజును ఒప్పించి సమస్య పరిష్కరించేలా తెదేపా అధినేత చంద్రబాబు చూడాలి. సింహాచలం భూముల సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేశాం’’ అని కన్నబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని