AP New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు.

Updated : 12 Jun 2024 14:36 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులతో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (మంగళగిరి), ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (టెక్కలి), కొల్లు రవీంద్ర (మచిలీపట్నం) మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

నాదెండ్ల మనోహర్‌ (తెనాలి), సత్యకుమార్‌ (ధర్మవరం), వంగలపూడి అనిత (పాయకరావుపేట), పొంగూరు నారాయణ( నెల్లూరు సిటీ), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల), ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ) మంత్రులుగా ప్రమాణం చేశారు. అనగాని సత్యప్రసాద్‌ (రేపల్లె), కొలుసు పార్థసారథి (నూజివీడు), డోలా బాల వీరాంజయనేయ స్వామి (కొండపి), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), కందుల దుర్గేశ్‌ (నిడదవోలు), గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), బీసీ జనార్దన్‌రెడ్డి (బనగాలపల్లి), టీజీ భరత్‌ (కర్నూలు సిటీ), సవిత (పెనుకొండ), వాసంశెట్టి సుభాష్‌ (రామచంద్రపురం), కొండపల్లి శ్రీనివాస్‌ (గజపతినగరం), మందిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి (రాయచోటి)తో మంత్రులుగా గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు