Hyderabad: హైదరాబాద్‌లో తెదేపా నేత ఇంటివద్ద ఏపీ పోలీసుల హల్‌చల్‌

హైదరాబాద్‌ బంజారాహిల్స్ ట్రెండ్‌సెట్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి  వద్ద ఏపీ పోలీసులు  హల్‌చల్‌ చేశారు. ఆ సమయంలో విజయ్‌ ఇంట్లో లేకపోవడంలో ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిని అదుపులోకి  తీసుకున్నారు.

Updated : 01 Oct 2022 16:57 IST

బంజారాహిల్స్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్ ట్రెండ్‌సెట్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటిని ఏపీ పోలీసులు చుట్టుముట్టారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో పనిమనిషిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారు ఎందుకు వచ్చారో.. అసలు కేసు ఏంటో కూడా చెప్పలేదని విజయ్‌ కుటుంబసభ్యులు వాపోయారు. ఇంట్లో పిల్లలు ఉన్న సమయంలో పోలీసుల పేరుతో హల్‌చల్ చేశారని మండిపడ్డారు. అసలు వచ్చింది పోలీసులా.. కాదా.. అనే విషయమూ తెలియట్లేదని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు నిర్వహించాలని ఒత్తిడి చేశారని విజయ్‌ కుటుంబసభ్యులు ఆరోపించారు.

జగన్‌ సర్కార్‌కు బుద్ధి రావడం లేదు: లోకేశ్‌

విజయ్‌ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా జగన్‌ సర్కార్‌కు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్ష సాధింపు సంస్థగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న కుటుంబాన్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారని.. విజయ్‌ అక్రమ అరెస్టుకు యత్నించడం దారుణమన్నారు. ఎందుకొచ్చారో చెప్పకుండా తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్తారా? అని ప్రశ్నించారు. ఇంట్లో పనిచేసేవారిపై బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని