Congress: జగన్‌ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు

ఏపీ ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో పార్టీ నేతలు వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీకి వినతిపత్రం సమర్పించారు.

Published : 22 Sep 2023 16:01 IST

విజయవాడ: విజయవాడ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ (YSR Health University)  ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీ వీసీకి మెమొరాండం ఇవ్వటానికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పార్డీ నాయకులను యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ మెమొరాండం ఇవ్వడానికి వచ్చిన తమపై పోలీసు ఆంక్షలు ఏంటంటూ రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి బస్సులో పడేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు ఇది నిదర్శనమని, బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నిర్బంధాలు కొత్తేమీ కాదని రుద్రరాజు తెలిపారు. రెచ్చగొట్టడం మానుకోవాలని పోలీసులకు ఆయన హితవు పలికారు. ఆందోళన తర్వాత కాంగ్రెస్ నాయకులు వీసీకి వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని