YS Sharmila: వైఎస్‌ షర్మిల ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు.

Published : 11 Dec 2022 14:24 IST

హైదరాబాద్‌: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోగ్యంపై అపోలో వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. లోబీపీ, బలహీనత వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. ‘‘షర్మిలకు డీహైడ్రేషన్‌, ఆర్థోస్టాటిక్‌ హైపోటెన్షన్‌, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్, ప్రీ-రీనల్ అజోటెమియా కూడాఉన్నాయి. ఈరోజు లేదా రేపు ఉదయం షర్మిలను డిశ్ఛార్జి చేసే అవకాశం ఉంది. ఆమె 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు’’ అని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. 

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని రెండు రోజులుగా షర్మిల ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం విషమిస్తుండటంతో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో పోలీసులు లోటస్‌పాండ్‌కు చేరుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని