Mayawati: ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసు సీబీఐకి అప్పగించాలి: మాయావతి

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ (Armstrong) హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్‌ చేశారు.

Published : 07 Jul 2024 22:00 IST

చెన్నై: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ (Armstrong) హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి (Mayawati) డిమాండ్‌ చేశారు. ఆయన భౌతికకాయానికి పార్టీ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌తో (Akash Anand) కలిసి చెన్నైలో (Chennai) ఆమె నివాళులర్పించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. అందుకే ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని విమర్శించారు. బాధితుడికి న్యాయం చేయాలనుకుంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కారణంగా దళిత నాయకులు భయాందోళనకు గురవుతున్నారని, బీఎస్పీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. పార్టీ కర్యకర్తలు శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని