Telangana News: 50 స్థానాల్లో పోటీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం: అసదుద్దీన్‌

తెలంగాణలో 50 స్థానాల్లో పోటీ చేయడంపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దీనికి ఇంకా టైం ఉందని.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Published : 10 Feb 2023 01:31 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంఐఎం (MIM) పార్టీ 50 స్థానాల్లో పోటీ చేయడంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని తెలిపారు. అసెంబ్లీ (TS Assembly) ఆవరణలో జరిగిన ఇష్టాగోష్ఠిలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM Kcr) తాజ్ మహల్ లాగే సచివాలయాన్ని చాలా బాగా నిర్మించారని కొనియాడారు. సచివాలయ ప్రారంభం అధికారిక కార్యక్రమం అని.. దానికి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే భారాస సభతో మాత్రం తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని అసదుద్దీన్‌ అన్నారు. తెలంగాణలో మంచి పరిపాలన చేస్తున్నారని, దేశమంతా వస్తే మంచిదేనని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఎంఐఎంను భాజపా బీ టీం అని కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాను ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో జేపీసీ కోసం అడిగితే ప్రధాని మోదీ అంగీకరించడం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని