Congress Crisis: ‘ఐ యామ్‌ సారీ..ఇక చేసేదేం లేదు’: గహ్లోత్‌

రాజీనామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గేతో అన్నట్లు...

Updated : 26 Sep 2022 20:51 IST

దిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఒకవేళ గహ్లోత్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే ఆ స్థానాన్ని సచిన్‌పైలట్‌కు ఇస్తామనడాన్ని నిరసిస్తూ దాదాపు 90కిపైగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామా పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌.. పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గేతో అన్నట్లు సమాచారం. 

రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠాన ఆదేశాలమేరకు గహ్లోత్‌తో మల్లిఖార్జున ఖర్గే భేటీ అయ్యారు. ఈ  సమావేశంలో ఎమ్మెల్యేల రాజీనామా అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై గహ్లోత్‌ స్పందిస్తూ..‘ ఐ యామ్‌ సారీ‌.. వాళ్ల రాజీనామాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక చేసేదేం లేదు’ అని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో గహ్లోత్‌ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తుండగా..అక్టోబర్‌ 17న జరగనున్న ఎన్నికల కోసం మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు గహ్లోత్‌ సిద్ధమవుతున్నారు. అనిశ్చితి తారస్థాయికి చేరుతుండటంతో ఆయనకు సన్నిహితుడైన కమల్‌నాథ్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని