LPG cylinder: రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.. వారికి మాత్రమే: గహ్లోత్
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gehlot) సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఉజ్వల్ పథకం లబ్ధిదారులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్(Gas cylinder) పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు.
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్(Ashok Gehlot) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ఉజ్వల్ పథకం(Ujjwala scheme) లబ్ధిదారులు వినియోగిస్తోన్న వంట గ్యాస్ సిలిండర్(Gas cylinder) ధరను దాదాపు సగానికి పైగా తగ్గించనున్నట్టు వెల్లడించారు. ఉజ్వల్ పథకం(Ujjwala scheme) లబ్ధిదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కేవలం రూ.500లకే రీఫిల్ చేయించుకొనే వెసులుబాటు కల్పించనున్నట్టు ప్రకటించారు. ఉజ్వల్ పథకంలో నమోదు చేసుకొని దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే దీనికి అర్హులని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసిన అశోక్ గహ్లోత్ ఈ ప్రకటన చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధరకే అందజేస్తామన్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో అవస్థలు పడుతున్న జనానికి ఉపశమనం కలిగించేలా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ గహ్లోత్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
‘‘వచ్చే నెల బడ్జెట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. ఈ నేపథ్యంలోనే ఓ విషయం చెప్పదలచుకున్నా. ఉజ్వల పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించారు. కానీ సిలిండర్ ఖాళీగా ఉంది, ఎందుకంటే సిలిండర్ ధరలు ఇప్పుడు రూ.1040లకు చేరాయి. అందువల్ల ఉజ్వల్ లబ్ధిదారులకు మేం రూ.500లకే ఒక్కో సిలిండర్ చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం’’ అని గహ్లోత్ హామీ ఇచ్చారు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపైనా అశోక్ గహ్లోత్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని.. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలు సైతం భయంతో పనిచేయాల్సి వస్తోందని ఆరోపించారు. నియంతృత్వ ధోరణిలో పాలిస్తూ ఈ దేశాన్నిఎటువైపు తీసుకెళ్తారో ఎవరికీ అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. కేంద్రాన్ని విమర్శిస్తున్నవారిని జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా