Chandrababu Arrest: వచ్చే ఎన్నికల్లో చంద్రసేనకు 160 సీట్లు ఖాయం: అశ్వనీదత్‌

వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన 160 సీట్లు సాధిస్తాయని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Updated : 26 Sep 2023 18:58 IST

రాజమహేంద్రవరం: వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన 160 సీట్లు సాధిస్తాయని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు లాంటి మహానాయకుడిని జైల్లో పెట్టడం దుర్మార్గమన్నారు. మహా నాయకుడిని జైల్లో పెడతారని ఎవరైనా ఊహిస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రసేన సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని