PM Security Breach: ప్రధాని హత్యకు కుట్ర.. పంజాబ్‌ సీఎంను అరెస్ట్‌ చేయాలి:బిశ్వ శర్మ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాన మంత్రిని హత్య చేసేందుకు

Updated : 13 Jan 2022 04:59 IST

డిస్పూర్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నిందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యంపై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానమంత్రిని హత్య చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం, పంజాబ్‌ సీఎం కుట్ర పన్నినట్లు లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ కుట్రలో భాగమైన సీఎంను అరెస్ట్‌ చేయాలి’’ అని హిమంత బిశ్వ శర్మ అన్నారు. 

జనవరి 5న పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పర్యటనలో ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆ రాష్ట్ర పోలీసులకు జనవరి 2వ తేదీనే నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీఎం హిమంత ఆరోపించారు. ఓ టీవీ ఛానెల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. ఈ ఘటన అనంతరం కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలు సైతం ఈ కుట్ర గురించి వారికి ముందే తెలుసున్నట్లుగా ఉన్నాయన్నారు.  

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయింది. దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భద్రతా వైఫల్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని